‘కబ్జా’ వైసీపీ నేతల దినచర్య..?

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శిరోముండనం దళితులపై దాడులు విషయంపై ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న దాడులను ఉద్దేశించి మాట్లాడిన లోకేష్… జగన్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.

రోజు రోజుకి దళితులపై జగన్మోహన్ రెడ్డి దమనకాండ ఎక్కువ అవుతూనే ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు టిడిపి నేత నారా లోకేష్. రోజు రోజుకి రాష్ట్రంలో శిరోముండనాలు, దాడులు హత్యలు హత్యచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్… వైసీపీ నేతల కబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి అంటూ విమర్శలు గుప్పించారు. అక్రమంగా భూములు కబ్జా చేయడం వైసీపీ నేతల దినచర్యగా మారిపోయింది అంటూ విమర్శించారు. అడ్డుకున్న దళితులపై దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.