NARAPPA : ఓటీటీలో నారప్ప.. రిలీజ్ డేట్ ఫిక్స్..

-

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నారప్ప”. ఈ సినిమా లో హీరో వెంకటేష్ మధ్య వయసుడిగా నటిస్తుంటే… ఆయన సరసన ప్రియమణి నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెట్రిమారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తమిళంలో మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో నిండిన ఈ కథతో ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇక ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాను రూపొందించాలని ఉద్దేశంతో దర్శకనిర్మాతలు, ఈ చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ కూడా పూర్తి అయింది. ఈ మూవీకి మణిశర్వ సంగీతం అందిస్తున్నారు.

అయితే… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ముందు అనుకున్న విధంగానే ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం పోస్టర్ రూపంలో వచ్చేసింది. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news