ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !

-

బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో బాగంగానే మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని జమున హ్యాచరిస్ భూముల వ్యవహారం తేల్చే పనిలో పడ్డారు అధికారులు.

అధికారులతో కలెక్టర్‌ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం అందుతోంది. అలాగే తూప్రాన్‌లో రాత్రంతా అధికారులు బిజీబిజీ గడిపారు. ఈటల భూముల పంపిణీ వ్యవహారంపై మూడు రోజులుగా కలెక్టర్‌ హరీశ్‌తో కలిసి తహసీల్దారు కార్యాలయ అధికారుల పనులు చేపట్టారు. ఇక ఈ రోజు, రేపు రైతులకు భూ పంపిణీ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

కబ్జా జరిగినట్టు తేల్చిన రైతుల భూముల్లో హద్దులు కూడా చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండు సార్లు సర్వే చేసిన అధికారులు.. ఈ విషయాన్ని తేల్చారు. గత కొన్ని రోజులుగా ప్రజాప్రతినిధులు, అధికారుల్ని కలుస్తూ వస్తున్నారు అచ్చంపేట రైతులు..ఇక  56 మంది రైతులకు సంబంధించిన 70.33 ఎకరాల భూమి ఈటల కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version