ఓటీటీలోకి శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. ఎప్పుడంటే?

-

ఫ్యామిలీ హీరో శర్వానంద్ చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మహానుభావుడు సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో నిరాశలో ఉన్న శర్వానంద్ కు అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఒకే ఒక జీవితం కలిసొచ్చింది. శర్వా పక్కా ఫ్యామిలీ హీరో అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా. శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో అమ్మ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ మూవీలో అక్కినేని అమ‌ల కీల‌క‌పాత్ర పోషించింది. థియేటర్లో మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌ దక్కించుకుంది. అక్టోబర్‌ 10 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version