బంగాల్‌లో దసరా వ్యాపారం ఎంతో తెలుసా..?

-

దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులంతా దుర్గాదేవికి పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నాపెద్దా అంతా కలిసి దుర్గా మండపాల్లో సందడి చేస్తున్నారు. ఈ సంబురాలతో దేశమంతా కోలాహలంగా మారింది.

ఈ దసరా వేడుకలు కేవలం సంతోషాన్నే కాదు కొందరికి ఆదాయాన్ని కూడా తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో దసరా వేడుకలు రూ.40 వేల కోట్ల వ్యాపారానికి వేదికయ్యాయి. అంతేకాదు ఏకంగా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఫోరమ్‌ ఫర్‌ దుర్గాస్తాబ్‌(ఎఫ్‌ఎఫ్‌డీ) ఛైర్మన్‌ పార్థో ఘోష్‌ సోమవారం వెల్లడించారు.

‘రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 వేల దుర్గా మండపాలను ఏర్పాటు చేశారు. ఒక్క కోల్‌కతాలోనే ఇవి మూడు వేలున్నాయి. వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి’ అని ఆయన వివరించారు.

‘‘ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు భాగస్వాములవుతారు. ముఖ్యంగా మండపాలు నిర్మాణదారులు, విగ్రహాల రూపకర్తలు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వాద్యకారులు, కూలీలు, కేటరింగ్‌ సేవలందించేవారు ఉంటారు’’అని ఘోష్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version