సాధారణంగా ధనికులంటే అత్యంత ఖరీదైన బ్రాండ్లకు చెందిన మద్యం సేవిస్తారనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఓ రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతం చాలా మంది ధనికులకు ఇష్టమైన మద్యం బ్రాండ్‌గా.. ఓల్డ్ మాంక్ రమ్ మారిందని తెలిసింది.
భోజన ప్రియులకు రకరకాల ఆహార పదార్థాలంటే ఇష్టం ఉన్నట్లుగానే.. మద్యం ప్రియులకు పలు రకాల భిన్నమైన బ్రాండ్లకు చెందిన మద్యం అంటే ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఇష్టపడే ఒకే రకానికి చెందిన మద్యం బ్రాండ్లు కూడా ఉంటాయి. అయితే సాధారణంగా ధనికులంటే అత్యంత ఖరీదైన బ్రాండ్లకు చెందిన మద్యం సేవిస్తారనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఓ రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతం చాలా మంది ధనికులకు ఇష్టమైన మద్యం బ్రాండ్‌గా.. ఓల్డ్ మాంక్ రమ్ మారిందని తెలిసింది.
ఓల్డ్ మాంక్ రమ్ సహజంగానే ధర తక్కువగా ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడు ధనికులు బాగా ఇష్టపడుతున్నారట. ధనికులు బాగా సేవిస్తున్న మద్యం బ్రాండ్లలో ఓల్డ్ మాంక్ రమ్ కూడా ఒకటిగా మారిందని హురున్ ఇండియన్ లగ్జరీ కన్‌జ్యూమర్ సర్వే 2019లో వెల్లడైంది. ఇక ఆ సర్వే రిపోర్టు చెబుతున్న ప్రకారం… ధనికుల్లో పురుషులు ఒకరికొకరు ఇచ్చుకుంటున్న గిఫ్టుల జాబితాలో మొదటి స్థానంలో వాచ్‌లు ఉండగా, రెండో స్థానంలో వైన్స్ ఉన్నాయి. మూడో స్థానంలో విదేశీ మద్యం బాటిల్స్ ఉన్నట్లు వెల్లడైంది.
ఇక ధనికులలో స్త్రీల విషయానికి వస్తే వారు ఇచ్చుకుంటున్న గిఫ్టుల జాబితాలో ఆభరణాలు మొదటి స్థానంలో నిలవగా, యాక్ససరీలు, గిఫ్ట్ కార్డులు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే ధనికులు సమాచారం తెలుసుకునేందుకు ఎక్కువగా పత్రికలు, టీవీ చానల్స్‌పై ఆధార పడుతున్నారని, డిజిటల్ మాధ్యమాలను వారు తక్కువగా ఆశ్రయిస్తున్నారని వెల్లడైంది. అదేవిధంగా రానున్న కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలోనైతేనే భారీగా డబ్బులు సంపాదించవచ్చని కూడా చాలా మంది ధనికులు ఆలోచిస్తున్నట్లు సదరు రిపోర్టులో వివరాలను ఇచ్చారు..!