ఈరోజుల్లో 30 ఏళ్లు రాగానే పనిలో చురుకుతనం తగ్గుతుంది.అందుకు కారణాలు కూడా లేకపోలేదు.. మనం తీసుకొనే ఆహారం కావొచ్చు.. మన చుట్టూ ఉన్న వాతావరణం కావొచ్చు..ఇక 50ఏళ్ల పైనబడిన వారి గురించి చెప్పానక్కర్లేదు..ఆ వయస్సులో అనేక రకాల అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నా.. శరీరం సహకరించదు.. శరీరం సహకరించినా శక్తి ఉండదు.. ఇలా ఎన్నో సమస్యలు వృద్ధాప్యంలో కనిపిస్తుంటాయి.
ఎంత వయస్సొచ్చినా.. కొంత మంది వ్యక్తులు వారు అనుకున్నట్లు జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడుతుంటారు. డ్యాన్స్ చేయడం, వాకింగ్, సైక్లింగ్, టీవీ చూడటం.. పాటలు పాడటం ఇలా ఏదో ఒకటి చేస్తూ జీవితాన్ని ఆనందిస్తుంటారు.. ఇప్పుడు మనం చెప్పబోయే బామ్మ కూడా అంతే.. ఆమె వయస్సు 80 ఏళ్లు కానీ యువతి లాగా అధరగొట్టింది.పారాగ్లైడింగ్ చేసి ఆనందించింది. ప్రస్తుతం బామ్మ పారాగ్లైడింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆమె పట్టుదలకు, ఆనందానికి ఫిదా అవుతున్నారు.
ఆ వీడియో ఇన్స్టా లో పోస్ట్ చేసారో లేదో లక్షలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు 4 మిలియన్లకు పైగా లైక్లు వచ్చాయంటే ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో చెప్పక్కర్లేదు. వీడియో క్లిప్ పాతదే అయినప్పటికీ తాజాగా వైరల్ అవుతోంది.. భాధాకర విషయం ఏంటంటే ప్రస్తుతం ఆ బామ్మ జీవించి లేరు.. మీరు కూడా ఆ వీడియోను చూడండి.. ఈ వీడియోను చూసిన వారంతా కూడా ఆమె ధైర్యానికి వావ్ అంటున్నారు.. నిజంగా గ్రేట్..