ఆర్ ఆర్ ఆర్ నుండి క్రేజీ అప్డేట్.. ఈ సారి హీరోయిన్ లుక్..

-

రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి హీరోయిన్ లుక్ వచ్చేసింది. కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తున్న బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ లుక్ బయటకు వచ్చింది. రిలీజ్ డేట్ ప్రకటన వచ్చాక నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోమ్మని చెప్పిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ అందుకు తగ్గట్టుగానే సడెన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది. ఒలివియా మోరిస్ ఇందులో జెన్నిఫర్ పాత్రలో కనిపించనుంది.

పాతకాలం నాటి జీపులో ప్రయాణిస్తున్న జెన్నిఫర్ ముఖంలో నవ్వు చాలా హాయిగా ఉంది. ఇండియన్ సినిమాపై మొదటి సారి కనిపిస్తున్న ఒలివియా మోరిస్ కి ఇది ప్రత్యేకమైన పాత్ర అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ నటిస్తున్నారు. మరి రామ్ చరణ్ సరసన నటించే ఆలియా భట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version