భారత్ లో వేయిని దాటిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య… ఇవ్వాళ ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో మహరాష్ట్రలో 198 కేసులు

-

భారత్ లో ఓమిక్రాన్, కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ కేసులు ఉదృతమవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం మొదలైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మహారాష్ట్రలో రికార్డ్ స్థాయిలో కరోనా, ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఈరోజు రికార్డ్ స్థాయిలో 198 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా..మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. మహారాష్ట్రలో 5,368 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం ముంబై నగరంలోనే 3,671 కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఓమిక్రాన్ కేసులు కూడా ముంబై నగరంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ముంబైనగరంలోనే 327 కేసులు ఉన్నాయి.  మొత్తంగా ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య వేయిని దాటింది.

ఇదిలా ఉంటే పెరుగుతున్న కరోనా, ఓమిక్రాన్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముంబై నగరంలో 144 సెక్షన్ కూడా విధించింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version