Video: స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టిన భర్త..చితక్కొట్టిన జనాలు !

-

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఓ జంట కు చేదు అనుభవం ఎదురైంది. సరయూ నదిలో ఆ జంట స్నానం చేస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారు. భార్య ముందు భర్తను కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన వివరా ల్లోకి వెళితే… సరయూ నది లో ఆ భార్యభర్తలిద్దరు… స్నానం చేస్తూ రొమాంటిక్ ఫీల్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తన భార్యకు భర్త ముద్దు పెట్టాడు.

అయితే ఈ సంఘటన ను పక్కన ఉన్న స్థానికులు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె భర్తను కొట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనను ఆపేందుకు అతని భార్య ఎంత ప్రయత్నం చేసినా… స్థానికులు అస్సలు విన లేదు. అతని చితక్కొట్టారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version