టిక్ టాక్ పై అమెరికా మోజు.. చైనా మీడియా ఘాటు వ్యాఖ్యలు

-

భారత్​లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్​టాక్ యాప్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. టిక్​టాక్ కొనుగోలు అంశంపై జరుగుతున్న చర్చలు సెప్టెంబర్ 15నాటికి పూర్తి కాకపోతే నిషేధం విధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అమెరికాలో టిక్​టాక్​ను బ్యాన్​ చేసే యోచనలో ఉన్నట్లు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దేశ భద్రత వంటి విషయాల్లో టిక్​టాక్ ముప్పుగా పరిణమించిందనే ఆరోపణల మధ్య ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు ట్రంప్.

Trump
Trump

మరోవైపు.. మైక్రోసాఫ్ట్​ సంస్థ టిక్​టాక్​ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలోని కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు టిక్​టాక్ యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది.తాజాగా ఈ విషయంపై స్పందించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల… టిక్​టాక్​ కొనుగోలు అంశంపై అధ్యక్షుడు ట్రంప్​తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ చర్చలు సెప్టెంబర్ 15లోపే ముగుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ ట్రంప్ వైఖరిని తీవ్రంగా ఖండించింది. చైనా ఉత్పత్తులను బ్లాక్ లిస్టులో పెట్టడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందని ప్రకటించింది. చైనాతో వాణిజ్య పరమైన బంధాలను తెంచుకోవడం ఏ ఉద్దేశంతో ఈ విధంగా చేసిందని ప్రచురించింది.

Read more RELATED
Recommended to you

Latest news