మరోసారి వాయిదా పడిన వ్యూహం సినిమా

-

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వ్యూహం’ .రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్న ‘వ్యూహం’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. టెక్నికల్ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈసారి కారణం లోకేశ్ కాదని సెటైర్ వేశారు. ‘వ్యూహం’ మార్చి 1న, ‘శపథం’ మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

RGV Vyuham movie 

రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాల్లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటిస్తుండగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తుంది.సినిమాలో వైఎస్సార్ మరణం ఆ తర్వాత జరిగే ఓదార్పు యాత్ర.. జగన్ జైలు ప్రయాణం.. బెయిల్ పై వచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం.. మొదలగు అంశాలపై ఈ సినిమా రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news