కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ఆరో విడత ఎన్నికలలో భాగంగా హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో హర్యానాలోని అంబాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే, శత్రువులు మనపై ఏది చేయడానికైనా ముందు 100 సార్లు ఆలోచిస్తారు అని అన్నారు.
పాకిస్థాన్ 70 సంవత్సరాల నుంచి ఇండియను ఇక్కట్లపాలు చేస్తోంది. ఒకప్పుడు వాళ్లకు చేతిలో బాంబులు ఉన్నాయి. ఇవాళ వాళ్ల చేతుల్లో భిక్షాపాత్ర ఉంది అని మోడీ అన్నారు. బలమైన ప్రభుత్వం అనేది ఉంటే శత్రువులు వణుకుతారు” అని మోదీ తెలిపారు. బలమైన మోదీ ప్రభుత్వం 370వ అధికరణ అనే గోడను కూల్చేసిందని, కశ్మీర్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. ఎన్నికల ఫలితాలు తేలడానికి మరో 17 రోజులే ఉన్నాయని, నాలుగు విడతల పోలింగ్‌లో ఇండియా కూటమి ఎత్తులను ప్రజలు చిత్తుచేశారని మోడీ అన్నారు.