రోజూ యాపిల్స్ తింటున్నారా? ముందు ఇది చదవండి..!

-

నిజంగానే యాపిల్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఉన్నాయి. యాపిల్స్ లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. అవి శరీరంలోని వ్యర్థాలను బయటికి తరిమేస్తాయి. యాపిల్ లో పైబర్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

యాన్ యాపిల్ ఏ డే.. కీప్స్ ఏ డాక్టర్ అవే.. అనేది సత్తెకాలపు మాట. ఎందుకంటే… యాన్ యాపిల్ ఏ డే… టేక్స్ యు టూ డాక్టర్ అని అనాల్సి వస్తుంది ఇప్పుడు. అవును.. రోజుకో యాపిల్ తింటే చాలు.. అస్సలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదని పెద్దలు అన్నారు కదా అని యాపిల్స్ తెగ లాగించేస్తున్నారా? ముందు ఇది చదవండి.

నిజంగానే యాపిల్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఉన్నాయి. యాపిల్స్ లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. అవి శరీరంలోని వ్యర్థాలను బయటికి తరిమేస్తాయి. యాపిల్ లో పైబర్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

కాకపోతే… యాపిల్స్ వల్ల శరీరంలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అదే ఇక్కడ సమస్య. ఉదాహరణకు మీరు ఒక యాపిల్ తిన్నారనుకోండి… 10 కోట్ల బ్యాక్టీరియాను ప్రత్యక్షంగా తిన్నట్టే లెక్క. అందులోనూ యాపిల్ రకాన్ని బట్టి కూడా బ్యాక్టీరియా మారుతుందట. అంటే.. దాన్ని ఎక్కడ సాగు చేశారు. ఏ పరిస్థితుల్లో సాగు చేశారు లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

ఈరోజుల్లో దేన్ని పండించినా.. కెమికల్స్ వాడకుండా పండిచరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. చాలా తక్కువగా సేంద్రియ ఎరువులతో పండిస్తారు. ఆర్గానిక్ గా పండించిన వాటిలో ఎక్కువ బ్యాక్టీరియా ఉండదు. కెమికల్స్ వేసి పండించిన వాటిలో పుష్కలంగా బ్యాక్టీరియా, ఫంగీ, వైరస్ ఉంటాయట.

అవి మన శరీరంలో పేరుకుపోతాయట. అవి అంత మంచి బ్యాక్టీరియా కూడా కాదట. చెడు బ్యాక్టీరియా అట. యాపిల్ లో ఎక్కువ శాతం బ్యాక్టీరియా గింజల్లో ఉంటుందట. అందుకే.. యాపిల్ తినేటప్పుడు గింజలు తీసేసి… గింజల చుట్టూ ఉన్న గుజ్జును కూడా తీసేసి తింటే, తొక్క తీసేసి తింటే కొన్ని కోట్ల బ్యాక్టీరియాను వదిలించుకున్నట్టే.

ఈ బ్యాక్టీరియా కడుపులో పేరుకుపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. చూశారా.. యాపిల్ తినడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటో ఈ కలికాలం. పండ్లు కూడా తినలేకపోతున్నాం. ఇక ఏం తినాల్నో ఏమో.

Read more RELATED
Recommended to you

Exit mobile version