వంద కిలోల హెరాయిన్ ప‌ట్టివేత‌

-

తూత్తుకుడికి దక్షిణంగా ఉన్న శ్రీలంక పడవ నుంచి 100 కిలోల హెరాయిన్‌తో సహా మ‌త్తు ప‌దార్థాల‌ను బుధ‌వారం ఇండియ‌న్‌ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. ఖాళీ ఇంధన ట్యాంక్ లోపల 99 ప్యాకెట్ల హెరాయిన్ (100 కిలోలు), 20 చిన్న బాక్సుల సింథటిక్ డ్ర‌గ్ ఔషధాలు, ఐదు 9 ఎంఎం పిస్టల్స్, మందుగుండు సామగ్రి త‌రలిస్తుండ‌గా ప‌ట్టుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఓ శాటిలైట్ ఫోన్ కూడా ల‌భించిన‌ట్లు చెప్పారు. పడవ కెప్టెన్‌తో సహా ఆరుగురు సిబ్బందిని ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఆ నౌక శ్రీలంక పశ్చిమ తీరంలోని నెగోంబోకు చెందిన అలెన్సు కుట్టిగే సిన్హా దీప్తా సాని ఫెర్నాండో దిగా గుర్తించారు.

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చుకోవ‌డానికే పాకిస్తాన్ దొంగ‌చాటు వ్య‌వ‌హారాల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే మాదకద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తున్న‌దని తెలిపారు. మ‌త్తు ప‌దార్థాల‌ను కరాచీ నుంచి పాకిస్తాన్ డో ద్వారా నౌక‌లో శ్రీలంకకు, అక్క‌డి నుంచి నుంచి పాశ్చాత్య దేశాలతోపాటు ఆస్ట్రేలియాకు పంపిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

Read more RELATED
Recommended to you

Exit mobile version