కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారిగా న్యాయం చేస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యాయాన్ని పాటిస్తుందని అన్నారు. పంజాబ్ తరహా లో తెలంగాణ రాష్ట్రం రైతులు పండించిన వడ్ల ను ఎందుకు కొను గోలు చేయరని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ ఎందుకు ఆందోళనలు చేస్తుంది అని ప్రశ్నించారు. కేంద్రం లో ఉన్న బీజేపీ కి రాష్ట్ర బీజేపీ మధ్య సమన్వయ లోపం ఉందని అన్నారు.
అందుకే ఢిల్లీ బీజేపీ నాయకులు ఒక విధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు మరొక విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతల కారణంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతుందని అన్నారు. ఈ బాయిల్డ్ రైస్ ను కేంద్రం తప్పని సరిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిల్వలు ఎక్కువ గా ఉన్నాయి అందుకే కొనుగోలు చేయాలేమని కేంద్రం అంటుందని అన్నారు.
అయితే కొన కుంటే ఏ రాష్ట్రంలో కూడా కొనుగోలు చేయద్దు.. కాని పంజాబ్ లో ఎందుకు కొనుగోలు చేస్తుందని అన్నారు. వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళన లను రేపటి నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ అందోళనలను భవిష్యత్ లో ఢిల్లీ వరకు తీసుకు వెళ్తామని అన్నారు. కూడా ధర్నాలు చేస్తాం.