సహాయ నిరాకరణ, సత్యాగ్రహమే ఆయన ఆయుధాలు.. సత్యం, అహింస ఆయన నమ్మే సిద్ధాంతాలు. కొల్లాయి కట్టి, చేత కర్రపట్టి, నూలు వడికి, మురికి వాడలు శుభ్రంచేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే ఎలుగెత్తి చాటిన ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. కేబుల్ న్యూస్ నెట్‌వర్క్ (సీఎన్ ఎన్) జరిపిన ఒక సర్వేలో 20వ శతాబ్ధిలోని రాజకీయ నాయకుల్లో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన నాయకుడిగా గుర్తించబడ్డారు. ఆయన మరెవరో కాదు, భారతీయులంతా ఆరాధించే, అభిమానించే, ఆదరించే స్వాంతంత్య్ర సమరయోధుడు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.
ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన వారిలో మహాత్ముడు అగ్రగ న్యుడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని ప్రభోదించిన ఆయన .. జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జాతిపితగా కీర్తించబడుతున్నారు. మోహనదాస్ కరంచంద్ గాంధీ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని ఓ సామాన్య కుటుంబంలో 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పుతలీభాయి. అప్పటి ఆచారం ప్రకారం 13 సంవత్సరాల పిన్న వ యస్సులోనే గాంధీకి కస్తూర్బాతో వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం.
19 సంవత్సరాల వయస్సులోనే గాంధీ న్యాయశాస్త్ర విద్య కోసం ఇంగ్గండ్ వెళ్లారు. అక్కడ బెర్నాల్డ్ షా వంటి ఫెబియన్లతో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సమయంలోనే ఆయన వ్యక్తిత్వం, ఆలోచన సరళి సమూలంగా మారాయి. 1981లో పట్టభద్రుడై భారత్‌కు తిరిగొచ్చాడు. ఆ తర్వా త 21 సంవత్సరాలపాటు ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఈ కాలం ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. తెల్లవాడు కానందు వల్ల రైలు బండి మొదటి తరగతి గది నుంచి గెంటివేయడం ఆయన హో టళ్లలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు, ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్లకు క ట్టినట్లు చూపాయి.
ఈ సమయంలోనే గాంధీజీలో నాయకత్వ లక్షణాలు పురుడుపోసుకున్నాయి. ఆయన ఆలోచనా సరళి ప రిపక్వం కావడానికి, రాజకీయ విధివిధానాలు రూపుదిద్దుకోడానికి దోహదపడ్డాయి. ఒకరకంగా భారత స్వాతంత్రోద్యమానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. ఈ సమయంలోనే భారతీయుల అభిప్రాయాలు కూ డగట్టి, అన్యాయాలపై వారిని జాగూరుకులను చేశారు. ఈ క్రమంలోనే 1894లో భారతీయులకు ఓటు హ క్కును కాలచేసేందుకు బ్రిటిష్ వారు తీసుకొచ్చిన బిల్లును గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే బిల్లు ఆమోదం పొందినప్పటికీ, గాంధీజీకి ప్రజల్లలో జనాధరణ బాగా పెరిగింది. క్రమంగా ఇదే ఆదరణ దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించే స్థాయికి గాంధీని తీసుకెళ్లింది.