కరోనా బాధిత కుటుంబాలను వెలివేస్తున్న గ్రామాలు.రోగం కంటే పక్కవారి వివక్షతో మరింత మానసిక క్షోభతో కుంగిపోతున్న కుటుంబాలు.కరోనా సోకిందంటే చాలు ఆకుటుంబాలకు అందని సామాజిక సహకారం. ఆకలి వేస్తుంది అని అడిగినా ఆహారం, మంచినీళ్లూ బంద్. అసలు పట్టించుకోని పంచాయతీ పాలక వర్గాలు. ఇలాంటి ఘటనలు మరెక్కడో జరిగాయి అని అనుకుంటున్నారా… ఈ తెలుగు రాష్ట్రంలో ఒకటైనా తెలంగాణలోని వరంగల్ లో జరిగింది.బయటకు రాలేక అవమానంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న కరోనా బాధితులు.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కరోనా పాజిటివ్ అని తెలిసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.పాజిటివ్ అని తెలిస్తే సమాజం వెలివేస్తోందని భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోనూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు.గ్రామీణుల్లో కరోనాపై అవగాహన కల్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని ఈ ఘటనలతో తెలుస్తోంది.చిన్న జలుబు చేసిన గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ బయటకి అందరికీ తెలిస్తే వాళ్ళని కూడా విలువ ఇస్తారుఎక్కడ బయటకి అందరికీ తెలిస్తే వారిని కూడా దూరం పెడతారు అని భయపడుతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.