కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు సూసైడ్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. చనిపోవడానికి చనిపోడానికి ముందు కుటుబంతో చివరిసారిగా వీడియో కాల్ లో నాగరాజు మాట్లాడినట్టు చెబుతున్నారు. రెండవ కేసులో ఏసీబీ కస్టడికి తీసుకోడానికి ముందు కేసు విషయంలో ఆ కాల్ లో మాట్లాడారు. ఆ కాల్ లో నేను ఏ తప్పు చేయ లేదని, అన్నీ ప్రాపర్ గానే ఉన్నాయని నాగరాజు అంటున్నారు. ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావు వెరిఫై చేసే చేశామని నాగరాజు పేర్కొన్నాడు.
న్యాయవాదికి చెప్పి కోర్టులో తెలపాలని కుటుంబాన్ని కోరగా బెయిల్ పై బయటకు వచ్చాక కోర్టులో చూద్దాం అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక ఓ ప్రనుఖ ఛానల్ తో మాటలాడిన నాగరాజు భార్య స్వప్న నా భర్త ను అన్యాయంగా కేసులో ఇరికించారని, నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. అసలు చంచల్ గూడ జైల్ లో ఏదో జరిగింది ? జైల్ లో నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే…ఏ ఒక్క జైల్ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు ? అని ప్రశ్నించారు. నా భర్త నాగరాజు ది ముమ్మాటికీ హత్యేనని ఆమె ఆరోపిస్తున్నారు.