“జమిలీ” ఎన్నికల కమిటీ రెడీ … సభ్యులు వీరే !

-

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయ నాయకులు అంతా జమిలి ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 5 రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ జమిలీ ఎన్నికలపై ఒక కమిటీ వేసి, వీరి పర్యవేక్షణలో సర్వే చేసి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి చూస్తోంది. అందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని చేసింది. తాజాగా ఈ కమిటీలో ఉన్న సభ్యుల పేర్లను రిలీజ్ చేసింది న్యాయ శాఖ. ఈ కమిటీలో అమిత్ షా, అధిర్ రంజన్ (కాంగ్రెస్ పక్ష నేత), ఆజాద్ (ఎంపీ), NK సింగ్ (15వ ఫైనాన్స్ కమిషన్ EX చైర్మన్), సుభాష్ కశ్యప్ (EX లోక్ సభ సెక్రటరీ), సంజయ్ కొఠారి (EX విజిలెన్స్ కమిషనర్) మరియు హరీష్ సాల్వే అడ్వాకెట్ ఉన్నారు.

మరి తొందరలోనే ఈ కమిటీలో సభ్యులు అంతా సర్వే చేసి ఈ జమిలీ ఎన్నికలు పెట్టడం మంచిదా కదా అన్నది నిర్ణయిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news