మరోసారి ప్రయోగం చేస్తున్న సూర్య ఈ సారి హిట్ పక్కా అంటున్నారే ..?

-

సుధ కొంగర ..ఈ లేడి డైనమిక్ డైరెక్టర్ తీసింది మూడు సినిమాలైనా సౌత్ అండ్ నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. 2010 లో ద్రోహి సినిమాతో దర్శకురాలిగా మారిన సుధ కొంగర ఆ తర్వాత మాధవన్ తో తమిళం హిందీలో ఒకేసారి సినిమాని తెరకెక్కించారు. తమిళంలో ఇరుది సుట్రు, హిందీలో సాలా ఖదుస్ గా తెర్కెక్కిన ఈ సినిమా అటు మాధవన్ కి ఇటు సుధ కొంగర కి మంచి క్రేజ్ ని తీసుకు వచ్చింది. కమర్షియల్ గాను రెండు భాషల్లో సూపర్ హిట్ ని అందుకుంది.

 

దీంతో ఇదే సినిమాని విక్టరీ వెంకటేష్ తో గురు గా తెరకెక్కించగా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. వెంకటేష్ అప్పటి వరకు చేసిన సినిమాలకంటే ఈ సినిమా చాలా డిఫ్రెంట్ గా తెరకెక్కడం తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సుధ కొంగర కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో ఒక సినిమా చేస్తున్నారు. వరస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య ఈ సినిమాతో మరో సారి ప్రయోగం చేస్తున్నారని కోలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. పాత్ర నచ్చితే ఎంతకైనా సాహసం చేసే సూర్య ఈ సినిమాకోసం 19 ఏళ్ళ కుర్రాడిలా మారడానికి చాలా కష్టపడ్డాడు.

గతం లో సూర్య ఇటువంటి సాహసాలు సూర్య సన్నాఫ్ కృష్ణన్, గజనీ, 24, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలకి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో తనని తాను మొత్తంగా మార్చుకున్నాడని డైరెక్టర్ సుధ కొంగర తెలిపారు. ఇక ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమాతో సూర్య సక్సస్ అందుకొని మళ్ళీ ఫాం లోకి రావాలని తాపత్రయపడుతున్నారు. ‘సూరారై పొట్రు’ అనే టైటిల్ తో తమిళం అలాగే ఈ ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news