భార‌త్‌లో వ‌న్‌ప్ల‌స్ 8 ఫోన్ల ధ‌ర‌లివే.. వెల్ల‌డించిన వ‌న్‌ప్ల‌స్‌..!

-

ప్ర‌ముఖ మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ ఇటీవ‌లే వ‌న్‌ప్ల‌స్ 8, 8 ప్రొ పేరిట త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసిన విషయం విదిత‌మే. క‌రోనా కార‌ణంగా వ‌న్‌ప్ల‌స్ ఈ ఫోన్ల‌‌ను ఆన్‌లైన్ ఈవెంట్‌లో విడు‌ద‌ల చేసింది. ఇక ఈ ఫోన్ల ధ‌ర‌ల‌ను వ‌న్‌ప్ల‌స్ తాజాగా ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో భార‌త్‌లో వ‌న్‌ప్ల‌స్ 8, 8 ప్రొ ఫోన్ల‌ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక లుక్కేద్దామా..!

oneplus 8 and oneplus 8 pro smart phone prices revealed in india

వ‌న్‌ప్ల‌స్ 8 సిరీస్ ఫోన్ల ధ‌ర‌లు…

* వ‌న్‌ప్ల‌స్ 8 – 6జీబీ, 128జీబీ – రూ.41,999
* వ‌న్‌ప్ల‌స్ 8 – 8జీబీ, 128జీబీ – రూ.44,999
* వ‌న్‌ప్ల‌స్ 8 – 12జీబీ, 256జీబీ – రూ.49,999

* వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ – 8జీబీ, 128జీబీ – రూ.54,999
* వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ – 12జీబీ, 256జీబీ – రూ.59,999

కాగా ఈ ఫోన్ల‌ను అమెజాన్‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో, ప‌లు ఇత‌ర రిటెయిల్ స్టోర్స్‌లో మే నెల‌లో విక్ర‌యించ‌నున్నారు. దేశంలో మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ ఉన్నందున ఆ త‌రువాతే వ‌న్‌ప్ల‌స్ ఈ ఫోన్ల‌ను విక్ర‌యించ‌నుంది.

ఇక వ‌న్‌ప్ల‌స్ 8లో… 6.55 ఇంచుల డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌, 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 16, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 6 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.1, 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

అలాగే వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.78 ఇంచుల డిస్‌ప్లే, 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్, 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 48, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, ఐపీ 68 వాట‌ర్ రెసిస్టెంట్‌, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 6 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, 4510 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.. త‌దిత‌ర ఫీచర్ల‌ను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news