మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ కొత్తగా వన్‌ప్లస్ బ్యాండ్ ను భారత్‌లో లాంచ్ చేసింది. భారత్‌లో ఈ కంపెనీకి చెందిన తొలి స్మార్ట్ బ్యాండ్ ఇదే కావడం విశేషం. ఇందులో 1.1 ఇంచుల అమోలెడ్ కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో 13 రకాల ఎక్సర్‌సైజ్ మోడ్స్ లభిస్తున్నాయి. వాటర్ రెస్టిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది.
ఈ బ్యాండ్‌లో హార్ట్ రేట్‌ను రియల్‌టైంలో తెలుసుకోవచ్చు. ఎస్‌పీవో2 సెన్సార్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులో 110 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. అందువల్ల ఈ బ్యాండ్ 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.
వన్‌ప్లస్ బ్యాండ్ ఫీచర్లు…
* 1.1 ఇంచ్ అమోలెడ్ కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 126 x 294 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* మెసేజ్, కాల్ నోటిఫికేషన్లు, వెదర్ ఫోర్‌క్యాస్ట్, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్
* హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీవో2 సెన్సార్, యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ ట్రాకర్
* 13 రకాల ఎక్సర్‌సైజ్ మోడ్స్, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.0 ఎల్ఈ
* ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, 110 ఎంఏహెచ్ బ్యాటరీ, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
వన్‌ప్లస్ బ్యాండ్ కేవలం బ్లాక్ కలర్‌లో మాత్రమే దానికి తగిన మ్యాచింగ్ స్ట్రిప్‌లో విడుదలైంది. ఈ బ్యాండ్ ధర రూ.2,499గా ఉంది. దీన్ని జనవరి 12వ తేదీన ఎక్స్‌క్లూజివ్‌గా వన్‌ప్లస్ సైట్‌లో విక్రయిస్తారు. మరుసటి రోజు నుంచి అన్ని ఆన్‌లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ బ్యాండ్ లభిస్తుంది.