రూ.4వేల మేర ధ‌ర త‌గ్గిన వ‌న్‌ప్ల‌స్ 7టి ప్రొ స్మార్ట్ ఫోన్

-

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ త‌న వ‌న్‌ప్ల‌స్ 7టి ప్రొ స్మార్ట్ ఫోన్ ధ‌ర‌ను రూ.4వేల మేర త‌గ్గించింది. ఈ ఫోన్ ఇప్ప‌టి వ‌ర‌కు రూ.47,999 ధ‌ర‌కు ల‌భ్యం కాగా.. ఇక‌పై దీన్ని రూ.43,999 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో త‌గ్గిన ధ‌ర‌కే ప్ర‌స్తుతం ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తున్నారు. కాగా ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌లో ల‌భిస్తోంది.

oneplus slashed one plus 7t pro smart phone price

ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్ కార్డులు ఉన్న‌వారు ఈ ఫోన్‌పై అద‌నంగా మ‌రో రూ.3వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ఈ ఫోన్ రూ.40,999 ధ‌ర‌కే ల‌భిస్తుంది. ఈ ఫోన్‌ను వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసిన వారికి వ‌న్‌ప్ల‌స్ కార్బ‌న్/శాండ్ స్టోన్ ప్రొటెక్టివ్ కేస్‌ను ఉచితంగా అందిస్తోంది.

వ‌న్‌ప్ల‌స్ 7టి ప్రొ ఫోన్‌లో.. 6.67 ఇంచుల డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, స్నాప్ డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, లిక్విడ్ కూలింగ్ టెక్నాల‌జీ, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 16, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, డాల్బీ అట్మోస్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4085 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news