ముదిరిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం…డీజీపీకి దగ్గరకి పంచాయితీ

కడప జిల్లా : బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇవాళ మఠం పీఠాధిపతి సమస్యను పరిష్కారం చేసేందుకు పీఠాధిపతులు వస్తున్న తరుణంలో వివాదం చెలరేగింది. పీఠాధిపతుల బృందం రాకను ఆయన రెండో భార్య మహాలక్ష్మి వ్యతిరేకిస్తున్నారు. మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రికే మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు ఆమె ఆరోపణలు చేస్తున్నారు.వారు మఠం సందర్శనకు రావడానికి ఎలాంటి హక్కు లేదని ఆరోపణలు చేస్తున్న మహాలక్ష్మి…ఇక నుంచి శ్రీ బ్రహ్మంగారి మఠంను శివ మఠంగా మారుస్తారా ? అని ప్రశ్నిస్తోంది.

లేని గొడవలు సృష్టించేందుకే పీఠాధిపతులు వస్తున్నారని..పూర్వ పీఠాధిపతి నిర్ణయం గౌరవిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆమోదంతో మఠంను పరిపాలించ గలరని ఆశిస్తున్నానని ఆమె పేర్కొంది. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామితో పాటు పీఠాధిపతులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కూడా ఆయన రెండో భార్య మహాలక్ష్మి ఫిర్యాదు చేసింది. అయితే రేపు మరోసారి వారసులతో చర్చల జరిపేందుకు పీఠాధిపతుల బృందం సిద్ధం అవుతోంది.