ఓటీటీలోకి ఓపెన్హైమర్ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్… ఎక్కడంటే?

-

ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో కిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్,ఫ్లోరెన్స్ పగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఓపెన్హైమర్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఇంగ్లీష్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో తాజాగా తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమయింది. నిజానికి ఈ మూవీ తెలుగు వర్షన్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక జియో సినిమా ఓపెన్హైమర్ తెలుగు వర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే… ఇందులో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మర్ఫీ నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఏకంగా ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఇక 96వ అకాడమీ అవార్డులు ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నేపథ్య సంగీతం, విభాగాలతో సహా మొత్తం 7 ఆస్కార్ అవార్డులు ఓపెన్ హైమర్ చిత్రం సొంతం చేసుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news