మే 13న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండడంతో ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జనసేన కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపిల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకొని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.
ఇదిలా ఉంటే… అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు మారింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాగా, తొలి విడతలోనే టీడీపీ నేత మహాసేన రాజేశ్కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. పలు కారణాలతో తాజాగా రాజేశ్ స్థానంలో సత్యనారాయణకు జనసేనని టికెట్ ఇచ్చారు.