భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది.
ఎన్నికలవేళ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి వైసిపి పార్టీపై విమర్శలు చేస్తుంది. మరోపక్క వైసీపీ కూడా ఈ కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ,ముద్రగడ పద్మనాభం, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంగా గీతతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇకనుంచి పిఠాపురం నియోజకవర్గంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. పకడ్బందీగా ప్రచారం నిర్వహించి ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించేలా చర్యలు తీసుకోవాలని వారికి జగన్ దిశానిర్దేశం చేశారు.