Operation Valentine : నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న వరుణ్‌తేజ్‌ కొత్త మూవీ

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయికగా నటించింది.నవదీప్, రుహానీ శర్మ, మీర్ సర్వర్ కీలక పాత్రలు పోషించారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది.ఈ మూవీ కలెక్షన్స్ పరంగా మాత్రం వెనుకబడిపోయింది.

ఇదిలా ఉంటే… కేవలం విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రం ఓటిటిలోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఈ మూవీ నెల రోజులకే ఓటీపీలోకి వచ్చేందుకు సిద్ధమైంది . అంటే ఈ మూవీ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news