మొబైల్స్ తయారీదారు ఒప్పో ఎ52 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌లను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్స్ డెప్త్ సెన్సార్‌లు ఉన్నాయి. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ గల బ్యాటరీకి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు.
ఒప్పో ఎ52 స్పెసిఫికేషన్లు…
* 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2400×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
* 12, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్‌వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
ఒప్పో ఎ52 స్మార్ట్‌ఫోన్ ట్వైలైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో విడుదల కాగా రూ.16,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.