మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ రెనో 4 ప్రొను భారత్‌లో శుక్రవారం విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల గేమ్స్‌ను స్మూత్‌గా ఆడుకోవచ్చు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను కేవలం 0.34 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్‌ను, 8జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుకభాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ కలిగిన మెయిన్ కెమెరాతోపాటు మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ మోనో సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 65 వాట్ల సూపర్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కేవలం 36 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అవుతుంది.
ఒప్పో రెనో 4 ప్రొ స్పెసిఫికేషన్లు…
* 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 2400 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్
* 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
* 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్, 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
ఒప్పో రెనో 4 ప్రొ స్మార్ట్‌ఫోన్ స్టారీ నైట్, సిల్కీ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌ను రూ.34,990 ధరకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఆగస్టు 5వ తేదీ నుంచి విక్రయించనున్నారు.