ఆన్‌లైన్ లో ఆర్డర్ చేస్తున్నారా…? ఇవి తప్పక ఫాలో అవ్వండి…!

-

ఆన్‌లైన్ లో సరుకులను ఆర్డర్ చేస్తున్నారా…? అయితే ఈ విషయం తెలుసుకోండి. ఈ కామర్స్ సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ కామర్స్ సర్వీసులు ఊపందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రజలను ఒక భయం మాత్రం బాగా వెంటాడుతుంది. రోజు రోజుకి కరోనా వ్యాప్తి ఏ రూపంలో వస్తుందో ఎవరికి అర్ధం కావడం లేదు.

ఈ నెల 20 నుంచి లాక్ డౌన్ సడలింపు లో భాగంగా ఈ కామర్స్ సర్వీసులను అనుమతి ఇస్తారు. అయితే ఏ సరుకులు తీసుకున్నా సరే మాస్క్ పెట్టుకోండి. అలాగే తీసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసే ముందు శానిటేషన్ చేయండి… ఒక బ్రష్ కో లేక క్లాత్ కో శానిటైజర్ పూయండి. తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కూడా శానిటేషన్ చేయండి. చిన్న పిల్లలను దగ్గరకు రానీయకుండా చూడండి. వృద్దులకు వాటిని దూరంగా ఉంచండి. వాటిని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత కాసేపు ఎండ లో పెట్టండి.

ఆ తర్వాత మీరు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోండి. మీ శరీర భాగాలకు ఎక్కడా కూడా దాన్ని తగలకుండా చూడండి. అదే విధంగా సరుకులను తీసుకునే సమయంలో క్యాష్ నేరుగా ఇవ్వకండి. ఫోన్ పే లేదా గూగుల్ పే లాంటి యాప్స్ వాడుకోండి. క్యాష్ ఆన్ డెలివరి ని పూర్తిగా దూరం పెట్టండి. తప్పదు అనుకుంటేనే వాడండి. మొబైల్ ఫోన్ ని కూడా ఓపెన్ చేసే వాటి దగ్గర ఉంచవద్దు. మొబైల్ గ్లాస్ మీద నాలుగు రోజులు వైరస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకైనా మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version