భారతీయులు గర్విస్తున్న క్షణాలివి: పవన్ కల్యాణ్‌

-

95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలుగు సినిమా తన సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ అవార్డును ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు.

ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయులు గర్విస్తున్న క్షణాలివి అని భావోద్వేగానికి గురయ్యారు.

‘‘ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన ‘RRR’లోని ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్‌ వేదికపై ప్రదర్శించడంతో పాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళికి ప్రత్యేక అభినందనలు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, నృత్య దర్శకులు ప్రేమ్‌ రక్షిత్‌, నిర్మాత డీవీవీ దానయ్యలకు అభినందనలు’’ అని పవన్‌కల్యాణ్‌ కితాబిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version