ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా ల పై తీసుకుంటున్న నిర్ణయాల వల్ల థీయేటర్ల కంటే ఓటీటీ లే బెటర్ అని అనిపిస్తుందని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లు ద్వారా ఎవరికి లాభం లేదని అన్నారు. దీని వల్ల సినీ పరిశ్రమ కు, థీయేటర్ల కు ప్రమాదం ఉంటుందని అన్నారు. బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలు ఉండవని ప్రభుత్వం చెబుతుందని సురేష్ బాబు అన్నారు.
అలాగే టికెట్ రేట్ల ను భారీ గా తగ్గించమని కూడా అన్నారని తెలిపారు. సినీ పరిశ్రమ కే భారీ నష్టమే అని సురేష్ బాబు అన్నారు. కాగ ఇప్పటి కే ఆన్‌లైన్ టికెట్ విధానం పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజా గా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పదవి కదిపారు. కాగ నిర్మాత సురేష్ బాబు నిర్మించిన దృశ్యం – 2 సినిమా ను అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేశారు.