ఆయన మళ్లీ మహారాష్ట్ర సీఎం అయ్యే వరకు మా బాధలు తీరవు :శంకరాచార్య స్వామి

-

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన మళ్లీ మహారాష్ట్ర సీఎం అయ్యే వరకు తన నొప్పి తగ్గదని అన్నారు.

సోమవారం ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రె నివాసం మాతోశ్రీలో అవిముక్తేశ్వరానంద సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ఠాక్రే దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మనందరం హిందూ మతాన్ని అనుసరించేవాళ్లం.పాపం, పుణ్యాలను విశ్వసిస్తాం. ద్రోహం అనేది అతిపెద్ద పాపం అని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రెకు అదే జరిగిందని అవిముక్తేశ్వరానంద అన్నారు. ఈ సందర్భంగా శివసేన పార్టీని ఏక్‌నాథ్ షిండే చీల్చడం ద్వారా ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేసిన ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆయన సంఘీభావం తెలిపారు.

తాను ఎదుర్కొన్న ద్రోహానికి మనమందరం బాధపడ్డామని, తనతో చెప్పాను. ఆయన మళ్లీ మహారాష్ట్ర సీఎం అయ్యే వరకు మా బాధలు తీరవని అన్నారు. మోసం చేసే వ్యక్తి హిందువు కాలేడని, మహారాష్ట్ర ప్రజలు ద్రోహానికి గురవుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news