శ్రీ‌వారి ల‌డ్డూల‌కు భ‌లే గిరాకీ.. రెండు రోజుల్లోనే 1 లక్షకు పైగా లడ్డూ విక్ర‌యాలు..

-

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గత రెండు రోజుల క్రితం నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ టీటీడీ కల్యాణ మండపంలో లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే విక్రయాలు ఆరంభమైన రెండు రోజుల్లోనే 1.35 లక్షల లడ్డూలను విక్రయించామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలకు భక్తుల నుంచి విశేష రీతిలో స్పందన లభించిందని వారు తెలియజేశారు.

మార్చి 25 నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా శ్రీవారి ఆలయం మూసి ఉండడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో భక్తులకు కొంత ఊరట కలిగించేందుకు టీటీడీ మే 25 నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో లడ్డూలను విక్రయించడం ప్రారంభించింది. ఇక రెండు రోజుల నుంచి హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలోనూ లడ్డూలను విక్రయిస్తున్నారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున విక్రయశాలలకు చేరుకుని లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. ఇక వారి కోసం లడ్డూలను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

కాగా.. టీటీడీ శ్రీవారి లడ్డూలు ఒక్కొక్కటి రూ.25కే విక్రయిస్తోంది. సాధారణంగా ఒక్కో లడ్డూ ధర రూ.50 ఉంటుంది. కానీ సగం రాయితీతో ప్రస్తుతం లడ్డూలను విక్రయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version