ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 సంవత్సరానికి నూతన మద్యం విధానం ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నూతన మధ్య విధానాన్ని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్… 2021-22 ఆర్ధిక సంవత్సరంలోనూ గతంలో లా 2934 దుకాణాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాది కాలానికి మద్యం దుకాణాల లైసెన్సు అమలులో ఉంటుందని గెజిట్ లో పేర్కోన్న ప్రభుత్వం.. 2021 అక్టోబరు 1 తేదీ నుంచి 2022 సెప్టెంబరు 30 తేదీ వరకూ మద్యం దుకాణాల లైసెన్సులు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం జాతీయ రహదారుల వెంట మద్యం విక్రయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని… తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గం వరకూ రహదారిపై మద్యం దుకాణాలను, పర్మిట్ రూములను అనుమతించబోమని స్పష్టం చేసింది. రీటైల్ అవుట్ లెట్ల సంఖ్యలో మార్పు లేకుండా వాకిన్ మద్యం దుకాణాల ఏర్పాటుకు ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది సర్కార్. ఇకపై మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి ఇస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటన చేసింది.