RDX Love Movie Teaser : సేఫ్టీలు కావాలంటున్నా పాయ‌ల్ రాజ్‌పుత్..!

-

పాయ‌ల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంత ర‌చ్చ చేసిందో చూసేశాం. ఆ సినిమాలో ఆమె బోల్డ్ న‌ట‌న‌కు తెలుగు యూత్ అందా ఫిదా అయిపోయారు. ఆమె ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ త‌ర్వాత ఆమె మీద ఓ ర‌క‌మైన ఇమేజ్ ప‌డ‌డంతో కొంద‌రు స్టార్లు అవ‌కాశాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. ఇక పాయ‌ల్ తాజాగా చేసిన సినిమా ఆర్డీఎక్స్ ల‌వ్‌. కొద్ది రోజులుగా స్టిల్స్‌తోనే హైప్ తెచ్చుకున్న ఈ సినిమా టీజ‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Paayal Rajput RDX Love Movie Teaser
Paayal Rajput RDX Love Movie Teaser

సినిమాలో శృంగారం మితిమీరిపోయింది. టీజ‌ర్‌ను బ‌ట్టి చూస్తే ప్రేమ జంట(తేజుస్ – పాయల్ రాజ్ పుత్). పేరుకి లవ్ ఉంటారు కాని ఛాన్స్ దొరికితే చాలు కామకలాపాలలో మునిగి తేలడం వీళ్ళకు మాములు విషయం. ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ తీసుకుంటామ‌ని చెపుతుంటారు. ఆఖరికి ట్రాఫిక్ పోలీస్ అడిగినా సదరు అమ్మాయే సేఫ్టీ కొనడానికి వెళ్ళాం అని చెప్పేంత రేంజ్.

దీనిని బ‌ట్టి విచ్చ‌ల‌విడి ప్రేమ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింద‌ని తెలుస్తోంది. పాయ‌ల్ ఇంట్లో పేరెంట్స్ లేన‌ప్పుడు.. మ‌న ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. త‌ప్ప‌దు అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాల‌న్న డైలాగ్ పేలుస్తుంది. ఇక అలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా అంటే స్వ‌ర్గం క‌నిపిస్తుంది… టైంలో ఎక్క‌డ నుంచి వ‌స్తున్నారు… తను సేఫ్టీ కావాలంటే తీసుకొస్తున్నాం…. ప‌దే ప‌దే సేఫ్టీలు కావాలంటున్నారు… ఎప్పుడైనా అప‌ర‌చితుడితో సెక్స్ చేశారా ఇలా నిమిషం టీజ‌ర్లోనే కావాల్సిన‌న్ని బూతులు ఉన్నాయి.

యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని ద‌ర్శ‌కుడు శంకర్ భాను… ఎక్స్ పోజింగ్ లో పాయల్ రాజ్ పుత్ ఇద్దరూ తమ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. పచ్చి బూతులు ప్రవోక్ చేసేలా ఉన్న భంగిమలు ఒకటా రెండా నిమిషం టీజర్ లోనే నానా రచ్చ చేశారు. పాయ‌ల్ ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా రెచ్చిపోయింది. ఇక సినిమాతో ఎంత ర‌చ్చ ఉంటుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news