కరీంనగర్: తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు పాటి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఆయన కారు పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో చేరికపై మా అనుచరుల సలహా తీసుకున్నానని కౌశిక్ రెడ్డి తెలిపారు. అందరూ టీఆర్ఎస్‌లో చేరమని చెప్పారు. హత్యారాజకీయాలు చేయడంలో ఈటలది అందెవేసిన చెయ్యమని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్ వల్ల హుజూరాబాద్ అభివృద్ది జరగలేదన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. తాజాగా కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరికపై స్పష్టత ఇవ్వడంతో ప్రచారానికి తెరపడింది.