ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఎన్నిలు జరుగుతున్న వేళ మరో ఉగ్రదాడి చోటు చేసుకుంది.పోలీసులు ప్రయాణిస్తున్న మొబైల్ వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.ఉగ్రవాదులు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.దాదాపు 30 నిమిషాల పాటు కాల్పులు జరిపారు.
ఈ ఘటన పోలింగ్ స్టేషన్ కు సమీపంలో జరిగింది. పోలీసులు మహిళల కోసం కేటాయించిన పోలింగ్ స్టేషన్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలి పివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో 241 మిలియన్ల జనాభా ఉండగా, అందులో 128 మిలియన్ల జనాభా మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.