వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్లు పోటీ పడ్డాయి. మ్యాచ్ కి ముందు పోటీ ఏకపక్షంగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ నెదర్లాండ్ అటు బౌలింగ్ లోనూ మరియు బ్యాటింగ్ లోనూ తన శక్తికి మించి ఆడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. మొదట టాస్ గెలిచి నెదర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 286 పరుగులకు ఆల్ ఔట్ అయింది. అనంతరం నెదర్లాండ్ మరో 82 పరుగులు సాధించాల్సి ఉండగా ఆల్ ఔట్ అయ్యి వరల్డ్ కప్ ను ఓటమితో స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో హరీష్ రాఫ్ 3, హాసన్ అలి 2 వికెట్లు తీసుకోగా …మిగిలిన వారందరూ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్ లో కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ను మంచి అర్థ సెంచరీ తో ఆదుకున్న షకీల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. కానీ పాకిస్తాన్ కు విక్రమ్ జీత్ సింఘ్, బస్ డే లీడ్, వాన్ బీక్ లు చమటలు పట్టించారు. కానీ చివరికి పాకిస్తాన్ అనుభవం ముందు ఓటమిని అంగీకరించక తప్పలేదు.