సూపర్ బౌలర్ “షహీన్ ఆఫ్రిది”కి చుక్కలు చూపించారు బ్రో… !

-

ఆసియా కప్ లో సూపర్ 4 లో భాగంగా ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో నిన్న వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా.. రిజర్వు డే ఉండడం మూలంగా ఈ రోజు ఒక గంట ఆలస్యంగా ప్రారంభం అయింది. ఇండియా ప్లేయర్లు కోహ్లీ మరియు రాహుల్ లు ఈ రోజు పాకిస్తాన్ బౌలర్లకు మరో వికెట్ ఇవ్వకుండా చుక్కలు చూపించారు. ఎంతలా అంటే … ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బౌలర్లలో మరియు ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లోనూ పాకిస్తాన్ కు బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది. షహీన్ ఆఫ్రిది, నసీం షా, హరీష్ రాఫ్ మరియు షాదాబ్ ఖాన్ లాంటి బౌలింగ్ యూనిట్ పాకిస్తాన్ కు సొంతం.. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ ఫ్యాన్స్ మా బౌలర్లు అంటే ఇండియా ప్లేయర్లకు భయం అంటూ కామెంట్ లు చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే.. అటువంటి భయంకర బౌలర్లను రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, కోహ్లీ మరియు రాహుల్ ఉతికి ఆరేశారు. షహీన్ ఆఫ్రిది 10 ఓవర్లలో పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక నసీం షా 9 .2 ఓవర్ లలో 53 పరుగులు ఇవ్వగా, హరీష్ రాఫ్ మరియు షాదాబ్ ఖాన్ లు వరుసగా 74 , 71 పరుగులు ఇచ్చుకున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇండియా ప్లేయర్స్ పాకిస్తాన్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news