చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ను అనుభవిస్తున్నారు. ఇక మరోవైపు చంద్రబాబు తరపున లాయర్లు ఆయనను ఏ విధంగా అయినా బయటకు తీసుకురావాళ్ళన్నా తపనతో చేయని ప్రయత్నం లేదు. ఇక తాజాగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ను హౌస్ రిమాండ్ కోసం అనుమతి ఇవ్వలనై ఒక పిటిషన్ ను ఏసీబీ కోర్ట్ లో వేశారు చంద్రబాబు తరపు లాయర్లు. ఈ విషయంపై సాయంత్రం చంద్రబాబు తరపున లూథ్రా మరియు సిఐడి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు, కానీ చంద్రబాబు తరపున లాయర్లు ఇస్తున్న వివరణ పట్ల సంతృప్తి చెందని ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ఈ విచారణను మరియు ఈ పిటిషన్ పై ఇవ్వనున్న తీర్పును రేపు మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది.
ఇక చంద్రబాబు హౌస్ రిమాండ్ పైన రేపు వెలవరించనున్న తీర్పుపై అందరూ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్నది తెలియాలంటే రేపు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.