బుద్ధి మార్చుకుని పాకిస్తాన్.. ఇక యుద్ధమే తరువాయి..!?

-

గత కొన్ని రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ భారత్ దీటుగా బదిలీ కోలుకోలేని దెబ్బ కొట్టినప్పటికీ పాకిస్తాన్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు రేఖ వెంబడి భారీగా కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. దీంతో సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి.

రాజౌరీ జిల్లాలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. అయితే అటు వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఏకంగా పాకిస్తాన్ను తిప్పి కొట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఘటనలో పలువురు జవాన్లు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఇలా పాకిస్తాన్ వరుసగా సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతూ ఉండడంతో భారత్ తీవ్రంగా స్పందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాగే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో యుద్ధం జరగడం ఖాయం అన్న విధంగా మారిపోతుంది పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Exit mobile version