పాకిస్థాన్‌ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌

-

పాకిస్థాన్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికలు మొదటి నుంచి ఆసక్తికరంగానే సాగాయి. చివరకు ఫలితాలు కూడా ఉత్కంఠ నెలకొల్పాయి. ఇక ఫలితాల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. అయితే పాక్ రాజకీయాల్లో మంగళవారం అర్ధరాత్రి అనూహ్య నిర్ణయం వెలువడింది. ఆ దేశ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయనను నామినేట్‌ చేస్తూ  పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబ్‌ ఎక్స్‌లో ప్రకటించారు.

74 ఏళ్ల నవాజ్‌ షరీఫ్‌ తన సోదరుడు 72ఏళ్ల షెహబాజ్‌ను నామినేట్‌ చేశారని ఔరంగజేబ్ తెలిపారు. మరియం నవాజ్‌ను పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా.. ప్రధాన మంత్రి పదవి రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ మంగళవారం స్పష్టం చేశారు. సర్కారు ఏర్పాటులో పీఎంఎల్‌-ఎన్‌కు మద్దతిస్తామని బిలావల్‌ భుట్టో జర్దారీ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news