ICC ODI RANKINGS: మొదటి స్థానాన్ని ఆక్రమించిన పాకిస్తాన్… !

-

ఆసియా కప్ లో పాకిస్తాన్ ఫైనల్ చేరకపోయినా ఇండియా మరియు శ్రీలంక చేతిలో భారీ ఓటమిలు కొని తెచ్చుకున్న తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్ డే ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని కైవశం చేసుకుంది బాబర్ ఆజామ్ సేన. రాత్రి ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా చేతిలో కంగారూలు ఓడిపోవడంతో పాకిస్తాన్ మొదటి స్థానానికి చేరువయింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా ఏకంగా మూడవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ 3105 పాయింట్ లతో 115 రేటింగ్ ను దక్కించుకుని మొదటి స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత స్థానంలో ఇండియా 4701 పాయింట్ లతో 115 రేటింగ్ లో ఉంది. ఆసియా కప్ లో ఇండియా టైటిల్ ను గెలుచుకున్నప్పటికీ ఇండియా మొదటి స్థానంలోకి చేరకపోవడం బాధాకరం.. కానీ బంగ్లాదేశ్ పై ఓడిపోవడంతో రెండవ స్థానానికి పడిపోయింది.

ఇక ఈ నెల 22న ఆస్ట్రేలియా తో జరిగే మొదటి వన్ డే లో ఇండియా గెలిస్తే పాక్ ను వెనక్కు నెట్టి ఇండియా మొదటి స్థానానికి ఎగబాకుతుంది. ఇక ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు వరుసగా మూడు నాలుగు ర్యాంక్ లలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news