పేదలపై సీఎం జగన్ కు చాలా గౌరవం: భూమన కరుణాకర్ రెడ్డి

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్కడ శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా నూతన టీటీడీ చైర్మన్ మరియు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డు జగన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో టీటీడీ ఉద్యోగుల కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకున్నారని .. కానీ అది ఆయన సీఎంగా ఉండగా వీలు పడలేదని బాధపడ్డారు భూమన. కానీ ఆయన కుమారుడు ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఈ కలను సాకారం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా తిరుపతిలోని సభలో భూమన మాట్లాడుతూ జగన్ గట్టిగానే అనుకున్నాడు కాబట్టే శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయిందని సంతోషంగా చెప్పారు. ఈ తిరుపతి అభివృద్ధిలో నేను కూడా భాగం అయినందుకు సంతోషిస్తున్నట్లు భూమన చెప్పారు.

ఒక్క తిరుతిలోనే కాదు.. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్ కు ప్రత్యేకమైన గౌరవం ఉందంటూ జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు.