పాకిస్తాన్ జనాలకు ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలనుకుంట. పరిస్థితి తమకు అనుకూలంగా లేకపోయినా సరే వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా మారే అవకాశం ఉండదు. అభివృద్ధి లేకపోయినా సరే తమకు నచ్చింది చేస్తూ ఉంటారు. భారత్ మీద కక్ష సాధించుకోవడానికి సైనికులు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో… అక్కడి ప్రజలు కూడా కరోనా తీవ్రతను అర్ధం చేసుకోలేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు
ఒకరికి ఒకరు దగ్గరగా ఉండవద్దని దూరం పాటించాలి అని సూచనలు చేస్తున్నా వాళ్ళు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఒకరి మీద ఒకరు పడి లాక్ డౌన్ ఉన్నా సరే రోడ్ల మీదకు వస్తున్నారు. ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో బెంబేలు ఎత్తుతుంటే, పాకిస్థాన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. అయినా సోషల్ డిస్టెన్సింగ్ పాటించేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు.
దేవుడు అంటూ ప్రార్ధనా మందిరాలకు వెళ్తున్నారు. ఏ విధంగా రక్షణ లేకుండా వాళ్ళు ప్రార్ధన చేయడానికి వెళ్తున్నారు. తమకు కరోనా సోకదు అని అల్లా చూసుకుంటాడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. అక్కడి ప్రజలకు మూడ నమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయని అందుకే వాళ్ళు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని అక్కడి కొందరు మత పెద్దలు కూడా అల్లా దయ ఉంటే కరోనా సోకదు అని చెప్పడాన్ని కూడా వాళ్ళు నమ్ముతున్నారు.