బయటపడిన పల్లవి ప్రశాంత్ మోసం..!

-

బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలిసిందే. రైతుబిడ్డగా సోషల్ మీడియాలో పలు వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. రియాల్టీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ
షాక్ కి గురి చేశారు ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి ఇచ్చారు అక్కడ పెట్టిన అన్ని టాస్కులు లో కూడా విజయాలని సాధించి ఫైనల్ కి చేరుకున్నారు. బిగ్ బాస్ టైటిల్ కొట్టడంతో సెలబ్రిటీ రేంజ్ కి వెళ్లిపోయారు నిరుపేద రైతులకు తన వంతు సహాయంగా ఉపయోగిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఎటువంటి సహాయం చేయలేదని నెట్టింట వార్తలు విపరీతంగా వస్తున్నాయి.

అన్నమాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఒక పేద రైతు కుటుంబానికి సహాయం చేశాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో కొలువురు గ్రామానికి చెందిన పేద రైతు అతని భార్య చనిపోవడంతో పిల్లలు అనాధ అయ్యారు. వారి కోసం లక్ష రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటుగా ఏడాదికి సరిపడా ఇచ్చాడు. వీడియో తీసి పల్లవి ప్రశాంత్ షేర్ చేశారు. ఇంకొంత మందికి సహాయం చేసి వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పారు. అలా చెప్పిన రెండు వారాలకి కూడా వీడియో రాలేదు దీంతో విమర్శలు ఎదురవుతున్నాయి. మాట తప్పాడని లక్ష రూపాయలు ఇచ్చి సైలెంట్ అయిపోయాడని అందరూ ఆడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news