పాన్ కార్డు ఉందా..? ఈ తప్పులని అస్సలు చెయ్యద్దు…!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు ఎన్నో వాటికి ప్రూఫ్ గా పని చేస్తుంది. పర్మినెంట్ అకౌంట్ నెంబర్‌ ఆర్థిక లావాదేవీలు మొదలు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. పన్ను శాఖ జారీ చేసే ఈ 10 అంకెల కార్డు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి కూడా. ఓ వ్యక్తి కి సంబంధించిన ఆర్థిక వివరాలు పాన్‌ కార్డ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే పాన్ కార్డు విషయంలో చాలా మంది పలు తప్పులని చేస్తున్నారు. కానీ వాటిని చెయ్యద్దు. ఈ తప్పుల వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని తప్పులు చేస్తే జరిమాన చెల్లించాల్సి వస్తుంది.

ఇక పూర్తి వివరాలని చూస్తే.. రిటర్న్‌ను దాఖలు చేసే సమయంలో పాన్ కార్డు కి సంబంధించి జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పుడు పాన్‌ వివరాలను ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే సమయంలో చెయ్యకూడదు. రూ.10,000 జరిమానా విధించే అవకాశం వుంది జాగ్రత్త. పైగా కొందరి దగ్గర రెండు పాన్ కార్డ్స్ ఉంటున్నాయి. కానీ అది తప్పు.

రెండు పాన్‌ కార్డులు కలిగి వున్నవాళ్లు ఒకటి సబ్మిట్ చెయ్యాల్సి వుంది. రెండో కార్డును సరెండర్‌ చేస్తే సమస్యే ఉండదు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధానాల్లోనూ పాన్ ని సరెండర్ చెయ్యచ్చు. మీరు దీని కోసం ఇన్‌కమ్‌ టాక్స్‌ వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో మీరు మార్పులు/కరెక్షన్స్‌ ఆప్షన్‌లోకి వెళ్తే చాలు అక్కడ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిల్ చేసాక నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజటరీ లిమిటెడ్‌కు కార్యాలయంలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రెండో పాన్‌కార్డ్‌ను సరెండర్ చేసేటప్పుడు కార్డును సబ్‌మిట్ చెయ్యాలి. ఇన్‌కమ్‌ టాక్స్‌ చట్టం, 1961 సెక్షన్‌ 272బీ ప్రకారం రెండు కార్డ్స్ వుండకూడదు. ఉంటే రూ. 10,000 వరకు జరిమానా పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version